30 June, 2026 | 11:53 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సీఎంఆర్‌ఎఫ్ పేద ప్రజలకు గొప్పవరం

31-05-2025 12:31 AM

-శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మే 30: శేరిలింగంపల్లి పరిధిలోని గోపి నగర్ కాలనీకి చెందిన శ్రీమతి పుట్ట శంకుతల వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2,50,000/- రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును తన నివాసంలో బాధిత కుటుంబానికి అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరంఅని ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని పునరుద్గాటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి  నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసాగా నిలుస్తుందని   తెలియచేశారు.

పేద మధ్యతరగతి ప్రజలకు ఆసుపత్రిలో బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ ఆర్థిక సాయం అందిస్తుందని దీనిలో భాగంగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో వందలాది కుటుంబాలను సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆదుకున్నామని తెలిపారు. వైద్య చికిత్సకు సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు  సాంబయ్య, రాజు నాయక్, వేణు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.