24 March, 2026 | 1:53 AM

పాఠశాల ఎదుట క్షుద్ర పూజలు

24-03-2026 12:20 AM

పాల్వంచ మండలంలో ఘటన 

పాల్వంచ, మార్చి 23, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని రంగాపురం లో ప్రభుత్వ పాఠశాల ఎదురు క్షుద్ర పూజలు ఘటన గ్రామంలో కలకలం రేపింది. రోజు వారీగా సోమవారం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ముగ్గులు వేసి, పూజ సామాగ్రిని వదిలి వేసిన దృశ్యాలను గమనించారు. భయాందోళనకు గురైన విద్యార్థులు విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు.

విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వెంటనే పాఠశాలకు చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటన అతివేగంగా గ్రామంలో వ్యాప్తి చెందడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు జరగడానికి కొన్ని పాఠశాలలో ప్రహరీ గోడలు లేకపోవడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీ గోడలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.