కాంగ్రెస్, బీజేపీవి దొంగ నాటకాలు
గ్యాస్ ధరలపై ఎల్బీనగర్ రింగ్ రోడ్డులో బీఆర్‌ఎస్ ఆందోళన
ఎల్బీనగర్, మార్చి 23 : యుద్ధం పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై గ్యాస్ ధరలు పెంచి, ఆర్థిక భారం వేసిందని బీఆర్‌ఎస్ నాయకులు ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒకరిపై ఒకరు నేపం వేసుకుంటూ ఆడుతున్న దొంగనాటకాలతోనే గ్యాస్ కొరత పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఎల్బీనగర్ చౌరస్తా వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్ సప్లై ఎక్కడా ఆగలేదు, అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అంటోందని, రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రం నుంచి సరైన సరఫరా లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి అని చెబుతోందన్నారు. ఈ ఇద్దరి పరస్పర ఆరోపణల మధ్యలో సామాన్య ప్రజలే తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ జీవనంపై ఆధారపడే ఆటో డ్రైవర్లు, టిఫిన్ సెంటర్ యజమానులు, ఓల్ ఏజ్ హోమ్స్ వంటి అనేక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఎన్నికల నేపథ్యంలో అస్సాం, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పాండిచేరి, కేరళలో కేవలం 50 రూపాయలు మాత్రమే పెంచుతున్నట్లు చెప్పారని, ఎన్నికల తరువాత భారీగా ధరలు పెంచుతారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్ రెడ్డి, చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్, జిట్టా రాజశేఖర్ రెడ్డి, పద్మ శ్రీనివాస్ నాయక్, సామ తిరుమల రెడ్డి, భవాని ప్రవీణ్ కుమార్, జిన్నారం విఠల్ రెడ్డి,
సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, ఎల్.బి.నగర్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు రవిముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నాయిడు, డివిజన్ల అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, సత్యంచారి, వరప్రసాద్ రెడ్డి, లింగాల రాహుల్ గౌడ్, చింతల రవికుమార్, శ్రీధర్ గౌడ్, రాజిరెడ్డి, జక్కిడి మల్లారెడ్డి, చిరంజీవి, శ్రీశైలం యాదవ్, రోజారెడ్డి పాల్గొన్నారు




