18 June, 2026 | 12:52 PM

సచివాలయంలో మంత్రివర్గం అనధికార భేటీ

18-06-2026 12:11 PM

హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో(Telangana Secretariat) కాసేపట్లో మంత్రివర్గ అనధికార భేటీ ప్రారంభం కానుంది. వివిధ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy), మంత్రులు చర్చించనున్నారు. రైతుభరోసా నిధులు, వ్యవసాయరంగంలో చేపట్టాల్సిన చర్యలు, కేంద్రంపై ఒత్తడి తెచ్చే అంశాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించే అవకాశముందని పార్టీ నేతలు వెల్లడించారు. SIR తో అర్హులైన ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తం చేయాల్సిన అంశాలపై చర్చించనున్నారు. తుమ్మిడిహెట్టి  బ్యారెజి ఎత్తుపై ఎలా ముందుకు పోవాలనే అంశంపై నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.