18 June, 2026 | 12:20 PM

భర్తను కడతేర్చిన భార్య

18-06-2026 11:32 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): అనుమానం, ఆపై నిత్య వేధింపులు దాడులు చేస్తుండడానికి భరించలేక భర్తను హత్య చేసిన భార్య ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సోమ్లా తండాలో గురువారం జరిగింది. తండాకు చెందిన బోడ లాలు ను ఆయన భార్య విజయ హత్య చేసి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. చాలాకాలంగా భార్యాభర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయని, ఆ నేపథ్యంలోనే హత్య జరిగిందని ప్రచారం సాగుతోంది.