20 August, 2026 | 10:39 PM

శిలాఫలకంలో ఎమ్మెల్యే పేరు మరిచిన అధికారులు

20-08-2026 09:34 PM

కోదాడ,(విజయక్రాంతి): రామలక్ష్మీపురంలో మిర్యాలగూడ–కోదాడ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి హుజూర్‌నగర్‌ మీదుగా బాలాజీనగర్‌ వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్‌ రోడ్డు నిర్మాణ పనులకు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ శిలాఫలకంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పేరు లేకపోవడంపై స్థానికులు, కాంగ్రెస్‌ శ్రేణులు విస్మయం వ్యక్తం చేశారు. అధికారులు ఈ విషయాన్ని ఎలా మరిచారంటూ చర్చించుకున్నారు.