20 August, 2026 | 10:58 PM

జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో సిద్ధార్థ విద్యార్థుల ప్రతిభ

20-08-2026 10:23 PM

భిక్నూర్,(విజయక్రాంతి): జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో సిద్ధార్థ విద్యాలయ విద్యార్థులు ప్రతిభ చాటారు. 10వ తరగతి విద్యార్థి షేర్ల సాయి వరుణ్ గౌడ్ డిస్కస్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌ సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. బాలికల 600 మీటర్ల పరుగులో 10వ తరగతి విద్యార్థిని తొలికుల అనూష కాంస్య పతకం సాధించింది. సాయి వరుణ్ గౌడ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్‌ బండి సుధాకర్, ప్రిన్సిపాల్‌ లింగాల శ్రీకాంత్‌ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పీఈటీ బీరయ్య సేవలను అభినందించారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించింది.