20 August, 2026 | 11:10 PM

రొమ్ము క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన

20-08-2026 10:37 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండల కేంద్రమైన మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సంధ్యారాణి ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్ పై గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం హెచ్ఓ డాక్టర్ సౌజన్య పాల్గొని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ... రూము క్యాన్సర్ పట్ల జాగ్రత్తగా ఉండాలని  మహిళలు సూచించారు. ఈ విషయంలో ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల గ్రామ సర్పంచ్ రాజగోని సౌందర్య, ఏపిఎం నర్సింలు, సీసీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.