23 May, 2026 | 6:01 AM

అధికారులు సమయ పాలన పాటించాలి

19-06-2024 12:05 AM

భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 18(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలో ఆకస్మిక తని ఖీ చేశారు. సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను పరిశీలించారు. విద్యుత్తు పొదుపు చేయాలనే లక్ష్యంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టు, విడతలవారీగా అన్ని శాఖలకు సోలార్ విద్యు త్తు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.