30 July, 2026 | 11:47 AM

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌ఐ సాయి శశాంక్

30-07-2026 11:10 AM

పలిమెల, జులై 30(విజయక్రాంతి): గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలనేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని  పలిమెల ఎస్ ఐ సాయి శశాంక్  అన్నారు. ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు మట్టి ఇళ్లలో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వానలకు గోడలు నానిపోయి బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు.

విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లను ఎవరూ తాకరాదని, విద్యుత్ సంబంధిత ప్రమాదాలలోపాలు గమనించినట్లయితే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.రైతులు వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు ఆన్ లేదా ఆఫ్ చేసే సమయంలో తడి చేతులతో  ముట్టుకోవద్దని విద్యుత్ పరికరాలను తాకకుండా తగు జాగ్రత్త వహించాలని, విద్యుత్ లీకేజీ అనుమానం ఉన్నప్పుడు మోటార్లను ఉపయోగించరాదని తెలిపారు.వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించే సమయంలో వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు మరియు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్‌ఐ సూచించారు.ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినట్లయితే ప్రజలు వెంటనే డయల్ 100 కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ 6301754440 కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.