నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు
19-06-2024 12:05 AM
కలెక్టర్ సత్యశారదాదేవీ
వరంగల్, జూన్ 18 (విజయక్రాంతి): రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సత్య శారదాదేవి హెచ్చరించారు. వరంగల్ శివారులోని ఎనుమాముల మార్కెట్‌ను మంగళవారం ఆమె సందర్శించారు. పత్తి విక్రయాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం నగరంలోని ఆగ్రో సెంటర్లు, విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే దుకానాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అదన పు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రసాదరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్, తహసీల్దార్ ఇక్బాల్ ఉన్నారు.






