జాఫర్‌గడ్‌లో కలెక్టర్ విస్తృపర్యటన
19-06-2024 12:05 AM
జాఫర్‌గడ్, జూన్ 18: జనగామ జిల్లాజాఫర్‌గడ్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషాషేక్ మంగళవారం పర్యటించారు. మిషన్ భగీరథ పనులను పరిశీలించారు. అనంతరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రిజిస్టర్‌ను పరిశీలించి గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశిం చారు. జాఫర్‌గడ్ కేజీబీవీ పాఠశాల, హాస్టల్‌ను సందర్శించి వంట గది, ఆహార నిల్వలను పరిశీలించారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ధరణి రికార్డులు తనిఖీ చేశా రు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు వెళ్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఆర్డీవో వెంకన్న, డీఈవో రాము, తహసీల్దార్లు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.






