బాబోయ్, పిచ్చి కుక్క!
29-05-2024 12:05 AM
రంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఒక పిచ్చికుక్క మొత్తం ఇరవై మందిని గాయపరిచిన సంఘటన అత్యంత విషాదం. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పదిమందిని గాయపరిచిన ఆ కుక్క మర్నాటి ఉదయం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన మరికొందరిపైనా దాడి చేయడం నిజంగా దారుణం. ఆ పిచ్చికుక్కను మున్సిపల్ సిబ్బంది పట్టుకోలేక పోవడం మరో విషాదం. అది మరెంత మందిని గాయపరుస్తుందో. ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులకు కుక్కల నుంచి రక్షణ పెద్ద సమస్యవుతున్నది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి.
-రామచంద్రం, బీహెచ్‌ఈఎల్ క్వార్టర్స్






