ప్రాణాంతక సాహసం
29-05-2024 12:05 AM
బంగ్లాదేశ్ దినపత్రిక స్టార్ వీడియోగ్రాఫర్ తీవ్ర తుపానును లక్ష్యపెట్టకుండా సమ్రుదంలోకి వెళ్లి పరిస్థితులను వీడియో తీసినట్లు వార్తలు వచ్చాయి. అతను ఎంత స్టార్ కళాకారుడైనా ఇటు వంటి ప్రాణాంతక సాహసాలు అవసరమా? ప్రకృతి విపరీతాలకు ఎదురువెళ్లడం వల్ల ఏదైనా జరగరానిది జరిగితే ఏమవుతుంది? యుక్తవయసులో ఉడుకురక్తంతో తీసుకొనే ఇలాంటి నిర్ణయాలు మన సాహసాన్ని తెలుపడానికి తప్ప మరెందుకూ పనికిరావు. ఇలాంటి వారికి అధికారులు ఎలా అనుమతి ఇస్తారో అర్థం కాదు.
-వేణుగోపాల్‌రావు, వేములవాడ






