27 July, 2026 | 3:53 PM

లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక

26-06-2024 11:22 AM

న్యూఢిల్లీ: 18వ లోక్ సభ స్పీకర్ గా ఓంబిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే తరుపున వరుసగా రెండోసారి ఎన్నిక కావడం విశేషం. లోక్ సభ సమావేశాలు మూడో రోజు కొనసాగుతున్నాయి. లోక్ సభలో స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. ఎన్డీయే తరుఫున ఓంబిర్లా, ఇండియా కూటమి తరుఫున కె. సురేష్ స్పీకర్ గా పోటీ పడ్డారు. స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోడీ తీర్మానం చేశారు. ప్రధాని మోడీ తీర్మానాన్ని ఇతర మంత్రులు బలపరిచారు. పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల పేర్లతో సభ్యులకు స్లిప్పులు పంచారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ, అన్నాడీఎంకే మద్దతు ప్రకటించినారు. ఇండియా కూటమికి మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌ మద్దతిచ్చారు. వైసీపీ మద్దతుతో 297కు ఎన్డీఏ బలం పెరిగింది. దీంతో లోక్ సభ స్పీకర్  గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. దీంతో ఓం బిర్లాను సభాపతి స్థానం వరకు ప్రధాని మోడీ, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ తీసుకెళ్లారు.