స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: లోక్ సభ స్పీకర్ గా మరోసారి ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాభినందనలు తెలిపారు. లోక్ సభ తరుఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లు సభ్యులందరికీ మార్గదర్శకం చేస్తారని విశ్వాసం ఉందని తెలిపారు. సభను సరైన దిశలో నడపడంలో స్వీకర్ ది కీలక పాత్ర అన్నారు. కొత్త ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. గతంలో బలరాం ఝక్కడ్ ఐదేళ్ల తర్వాత మరోసారి స్పీకర్ పదవి చేపట్టారని గుర్తుచేసుకున్న ప్రధాని ఆ తర్వాత రెండోసారి స్పీకర్ పదవి చేపట్టే అవకాశం మీకు వచ్చిందన్నారు. బలరాం జక్కడ్ తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదని చెప్పారు. పోటీ నెలకున్న సందర్భంగా మీరు స్పీకర్ పదవి గెలిచి వచ్చారని కొనియాడారు. ఈ పదవి ఎంత కఠినమైనదో మీకు బాగా తెలుసన్నారు. చాలా మంది లోక్ సభ సభ్యులకు మీతో పరిచయం ఉందని ప్రధాని పేర్కొన్నారు.






