15 March, 2026 | 9:09 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

సింబాకు వంద మార్కులు పక్కా

07-08-2024 12:05 AM

అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సింబా’. సంపత్ నంది అందించిన ఈ కథకు మురళీ మనోహర్ దర్శకత్వం వహించారు. సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 9న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్యే విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేయడమే ఈ మూవీ మొదలవ్వ డానికి కారణం.

తర్వాత హరితహారం గురించి తెలుసుకున్నా. ఈ చిత్రం అందరికీ కనువిప్పు కలిగేలా, సందేశాత్మ కంగా ఉంటుంది. నేను మా నిర్మాత రాజేందర్ రెడ్డికి మాస్ కమర్షియల్ కథలు చెప్పా.. లాభాలు వస్తాయని చెప్పా. కానీ మా నిర్మాత మాత్రం సింబా కథను ఎంచుకున్నారు. సమాజానికి మంచి చేయాలనే, ఏదైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం చేశారు. అలాంటి మంచి వ్యక్తి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు.. అందరినీ మెప్పిస్తుంది.. ఈ సినిమాను చూస్తే వందకు వంద మార్కు లు వేస్తారు’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అతిథులు, చిత్రబృందం కూడా మాట్లాడి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.