సైబర్ సెక్యూరిటీపై పట్టు సాధించాలి
- ఎవర్నార్త్ హెల్త్ సర్వీసెస్ ప్రతినిధి చైతన్య ఏమని
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ‘సైబర్ సెక్యూరిటీ టూల్స్’పై వర్క్‌షాప్
- సైబర్ సెక్యూరిటీ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ దాడుల నుంచి డేటాను రక్షించుకోవడానికి సైబర్ సెక్యూరిటీపై పట్టు సాధించడం అత్యంత అవసరమని ఎవర్నార్త్ హెల్త్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ ప్రొటె క్షన్ మేనేజర్ చైతన్య ఏమని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం ‘సైబర్ సెక్యూరిటీ టూల్స్’ అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు.
డిపార్ట్మెంట్ ఆఫ్ ఏసీఎస్‌ఈ, ఆఫీస్ ఆఫ్ డీవోఐఆర్-ఇండస్ట్రీ రిలేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చైతన్య ఏమని ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.కార్యక్రమంలో చైత న్య ఏమని మాట్లాడుతూ.. సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయని, వాటిని అరికట్టడానికి అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ టూల్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
విద్యార్థులు కేవలం థియరీకి పరిమితం కాకుండా, ప్రాక్టికల్‌గా టూల్స్‌ను ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నప్పుడే ఈ రంగంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు. వర్క్‌షాప్‌లో భాగంగా విద్యార్థులకు వివిధ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్లు, డేటా ప్రొటెక్షన్ మెళకువలు, నెట్‌వర్క్ భద్రతపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చా రు. నేటి కార్పొరేట్ సంస్థలు సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందన్నారు.
విద్యార్థులు అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు ఇలాంటి వర్క్‌షాప్‌ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చా రు. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ నేటి టెక్నాలజీ ప్రపంచంలో మనం ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నామో, అంతే వేగంగా సైబర్ ముప్పు లు కూడా పెరుగుతున్నాయని అన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్న తరుణంలో, ఆ డేటా ను రక్షించే ‘సైబర్ సెక్యూరిటీ’ అనేది ఒక వెన్నెముక లాంటిదని చెప్పారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో అపారమైన ఉద్యో గ అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
విద్యార్థలు గ్లోబల్ స్టాండర్డ్స్కు అనుగుణంగా మి మ్మల్ని మీరు మలుచుకో వాలన్నారు. మా విద్యార్థులను కేవలం గ్రాడ్యుయేట్లుగా మాత్రమే కాకుండా, ఇండస్ట్రీకి అవసరమైన నిపుణులుగా తీర్చిదిద్దడమే విజ్ఞాన్ ్స యూ నివర్సిటీ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా విభా గాల హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.




