6 May, 2026 | 2:38 AM

ఆసుపత్రిలో బాధ్యతగా విధులు నిర్వహించాలి

06-05-2026 01:15 AM

డీఎంఅండ్ హెచ్ ఓ రవీందర్ గౌడ్

విజయక్రాంతి ఎఫెక్ట్

తాడ్వాయి మే 5 (విజయక్రాంతి): ఆస్పత్రిలోని సిబ్బంది అందరూ బాధ్యతగా విధులు నిర్వహించాలని, సమయసారని పాటించాలని డిఎం అండ్ హెచ్ ఓ రవీందర్ గౌడ్ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన మంగళవారం సందర్శించారు. సోమవారం విజయక్రాంతి దినపత్రికలో వచ్చిన ఆదివారం ఆసుపత్రికి సెలవు... అనే వార్తకు డిఎం అండ్ హెచ్ ఓ స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆసుపత్రిని తెరిచి ఉంచాలని సూచించారు. సమయాన్ని కచ్చితంగా పాటించాలన్నారు. ఎవరైతే సమయపాలన పాటించరో, బాధ్యతారహితంగా వ్యవహరిస్తారో వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ సందర్భంగా మహిళలకు ఎలా చికిత్సలు నిర్వహిస్తున్నారు, గర్భిణీ స్త్రీలు ఆసుపత్రికి ఎంతమంది వస్తున్నారు,వారికి సరైన చికిత్సలు అందుతున్నాయా లేదా అనే విషయంపై ఆరా తీశారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి కాసిం, విజయలక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.