గుజరాత్‌కు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ
నేటి నుంచి పార్టీల అభిప్రాయ సేకరణ
గాంధీనగర్, మే 19: వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ మంగ ళవారం సాయంత్రం మూడు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్‌కు చేరుకుంది. సీఎం భూపేంద్ర పటేల్, ఉన్నతాధికారులతో సమావేశం కానుంది. రాష్ట్రంలోని పలు రాజకీయ పార్టీలు, అధికారులతో సంప్రదింపులు జరపడం ప్రారంభించింది. ఈ కమిటీలో మొత్తం 39 మంది సభ్యులున్నారు. బుధవారం ఆయా పార్టీల అభిప్రాయాలను తెలియజేసేందుకు గాంధీనగర్‌కు రావాలని కమిటీ ఆహ్వానించింది.
ఈ విషయంపై బీజేపీ పూర్తి మద్దతునిస్తుందని అధికార ప్రతినిధి అనిల్ పటేల్ ప్రకటించగా, కాంగ్రెస్ పార్టీ ప్రజా హక్కులు, ఆందోళనలను కమిటీ ముందు ప్రస్తావిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తెలిపారు. ఈ కమిటీకి ప్రముఖ న్యాయవాది పీపీ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. 27మంది లోక్‌సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ ఎంపీలున్నారు. ప్రియాంక గాంధీ, సంబిత్ పాత్ర, బాన్సురి స్వరాజ్ లాంటి ప్రముఖులకు కమిటీలో చోటు కల్పించారు.






