20 May, 2026 | 2:49 AM

చమురు కొనుగోళ్లకు గడువు పెంపు

20-05-2026 01:39 AM

భారత్‌కు ట్రంప్ మినహాయింపులు

న్యూఢిల్లీ, మే ౧౯: రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వెసులు బాటు కల్పించారు. ట్రంప్ గత నిర్ణయం ప్రకారం ఈ నెల ౧౬తో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేయాల్సి ఉంది. కానీ, పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతుండటం, చమురు సరఫరాకు ఆటం కాలు కలుగుతుండటం వల్ల ఆ గడువును జూన్ 17 వరకు పొడిగించారు. ట్రంప్ నిర్ణయాన్ని మంగళవారం ఆ దేశపు ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ ధ్రువీకరించారు.

ఈ నిర్ణయంతో దేశీయ రిఫైనరీలు రష్యా నుంచి సునాయాసంగా చమురు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అ యితే.. అమెరికా మినహాయింపులతో తమకేమీ సంబంధం లేదని, దీనిలో భాగంగానే తాము ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.