17 April, 2026 | 11:22 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కుంగింది రెండు పిల్లర్లే

08-06-2025 12:35 AM
  1. మొత్తం కాళేశ్వరమే కూలినట్టు కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
  2. 20.33 లక్షల ఎకరాలకు నీరందించాం
  3. మేడిగడ్డ స్థలాన్ని ఎంపిక చేసిందే కేంద్రప్రభుత్వ సంస్థ వాప్కోస్ 
  4. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో  మాజీమంత్రి హరీశ్‌రావు స్పష్టం

హైదరాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): మేడిగడ్డ బరాజ్‌లోని 2 పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలినట్టు కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ని 20.33 లక్షల ఎకరాలకు సాగునీరందించామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై శనివా రం ఆయన హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం అంటే 3 బరాజ్‌లు, 15 రిజర్వాయ ర్లు, 21 పంప్‌హౌస్‌లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 గ్రావిటీ కాలువలు, 98 కిలోమీ టర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టీఎంసీల నిల్వ సామర్థ్యం, 530 మీటర్ల ఎత్తుకు నీటి ఎత్తిపోతలు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు తక్కువ ఉంటా యని ప్రాజెక్ట్‌ను మేడిగడ్డకు మార్చాం. మేడిగడ్డ బరాజ్‌ను 7 బ్లాకులుగా, 85 పియర్లుగా నిర్మించారు.

కాళేశ్వరం లేకుండా పంటలు పం డాయని ప్రజాప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వ రం వల్లే యాసంగిలోనూ పంటలు పండాయి. ఈ ప్రాజెక్ట్‌కు 3 వనరుల ద్వారా నీటి వనరుల లభ్యత ఉంది. ఆ నీటితో వేలాది చెరువులు నింపొచ్చు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్‌వరకు నిర్మించిన బరాజ్‌లన్నీ వాడకంలో ఉన్నా యి. కాళేశ్వరం కింద కాలువ ద్వారానే 90 వేల ఎకరాలకు నీరు అందించొచ్చు’ అని పేర్కొన్నా రు.

రాష్ట్ర విభజన సమయంలో గోదావరి జలాల్లో తెలంగాణకు 940 టీఎంసీలు కేటాయిస్తే, తెలంగాణ ఎప్పుడకూ గోదావరి జలా లను ఏనాడు 400 టీఎంసీలకు మించి వాడుకోలేదని చెప్పారు. ప్రాణహిత ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లలో అనుమతులు కూడా సాధించలేదని మండిపడ్డారు. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రారంభించకుండానే కాలువలు తవ్వకాలు చేపట్టారని, 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా చెప్పారని ఆరోపించారు.

ప్రాజెక్ట్ ప్రారంభించడానికి ముందే 2011 నాటికి అంచనా వ్యయా న్ని రూ.40 వేల కోట్లకు పెంచారని విమర్శించారు.  కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిష న్ ముందు హాజరై, కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కాళేశ్వరంతో బీఆర్‌ఎస్‌కు మంచి పేరు వస్తోందని.. అందుకే ప్రాజెక్ట్ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు.

నాడు టీడీపీలో ఉన్న రేవం త్‌రెడ్డి, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా పేర్కొని ఇవాళ సీఎం పదవి దక్కడంతో వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. నీటి లభ్యత లేనందునే ప్రాణహిత-చేవెళ్ల రీ ఇంజినీరింగ్ చేశామని, హైడ్రాలజీ విభాగం అక్కడ ప్రాజెక్టుకు సరిపడా నికర జలాలు లేవని తేల్చిచెప్పిందన్నారు. ప్రాజెక్టుపై పునరాలోచన చేయాలని సెంట్రల్ వాటర్ కమిషన్ సూచించిందన్నారు.

తుమ్మడిహెట్టి వద్ద ప్రతిపాదించిన బరాజ్ నిర్మాణం కోసం ప్రభుత్వపరంగా, రాజకీయంగా ఎన్నో ప్రయత్నాలు చేశామని, అవేమీ ఫలించకపోవడంతోనే ప్రత్యామ్నాయ స్థలమైన మేడిగడ్డను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ ఎంపిక చేసిందన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యీలు, మాజీ కార్పోరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు.