16 July, 2026 | 1:11 AM

జిల్లాలో క్రీడా స్ఫూర్తి ప్రతిబింభించేలా పోటీల నిర్వహణ

16-07-2026 01:11 AM

అదనపు కలెక్టర్ నగేశ్ 

మెదక్, జులై 15 (విజయక్రాంతి): జిల్లాలో క్రీడా స్ఫూర్తి ప్రతిభంభించేలా సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహణకు వ్యాయామ ఉపాధ్యాయుల సమన్వయం చాలా అవసరమని అ దనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. జిల్లా విద్యాధికారి అధ్యక్షతన బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని పీడీలు, పీఈటీలతో సమన్వయ కమిటీ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, ఏ ఎం ఓ సుదర్శన్ మూర్తి సంబంధిత పీడీలు, పీఈటీల తో అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ..ఆగస్టు 25వ తేదీలోపు మండల స్థాయి క్రీడా పోటీలను పూర్తి చేయాలని, అనంతరం సెప్టెంబర్ మొదటి వారం నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. పోటీల నిర్వహణలో నాణ్యత, సమయపాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి పకడ్బందీగా క్రీడా పోటీలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అలాగే, రాష్ట్రస్థాయికి ఎంపికైన SGF క్రీడాకారులకు డ్రెస్సులు అందించే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకునేలా కృషి చే స్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్ జి ఎఫ్ వ్బుసైట్ పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్ లో క్రీడాకారులకు సంబంధించిన కీలక సమాచారాలతో పాటు గతంలో మెదక్ జిల్లా నుండి ప్రతిభావంతులైన క్రీడాకారుల వివరాలు జిల్లాస్థాయి, రా ష్ట్రస్థాయి, పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం లభ్యమవుతుందన్నారు.

క్రీడాకారులు వారికి నైపుణ్యం గల పాటలలో ప్రతిభ కనబరచడానికి ఈ పోర్టల్ ఒక వేదికగా నిలుస్తుందన్నారు. అంతకుముందు జి ల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్. నాగరాజు మాట్లా డుతూ, గత విద్యా సంవత్సరంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలలో 4,150 మంది బాలబాలికలు వివిధ క్రీడాంశాలలో పాల్గొన్నా రని తెలిపారు. వారిలో 192 మంది రాష్ట్ర స్థాయికి, 16 మంది జాతీయ స్థాయికి ఎంపి కై జిల్లాకు గుర్తింపు తీసుకొచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ మాని టరింగ్ అధికారి శ్రీ సుదర్శనమూర్తి, పీటీల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎస్. నాగరాజు, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మధు, శ్రీధర్ రెడ్డి మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.