సికింద్రాబాద్ క్లబ్ బ్యాడ్మింటన్ టోర్నీకి అనూహ్య స్పందన
సికింద్రాబాద్, సెప్టెంబర్ 4 : తెలంగాణలో(Telangana) బ్యాడ్మింటన్ క్రీడకు(Badminton Sport) ఉజ్వల భవిష్యత్తు ఉందని, చిన్న వయసు నుంచే క్రీడాకారులను(Players) ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయికి(International Level) తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సికింద్రాబాద్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్ కైలాస(Srinivas Kailasa) అన్నారు. సికింద్రాబాద్ క్లబ్ వేదికగా నిర్వహించిన అండర్ 15 బ్యాడ్మింటన్ టోర్న మెంట్‌కు ఏకంగా 375 మంది క్రీడాకారుల నుంచి ఎంట్రీలు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణలో బ్యా డ్మింటన్ అభివృద్ధికి కృషి చేస్తున్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, భారత బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, అడ్వైజర్ లక్ష్మణ్, యూవీఎన్ బాబు, వంశీధర్ తదితరులను శ్రీనివాస్ కైలాస అభి నందించారు. ప్రభుత్వం, క్రీడా సంఘాలు, ఇతర సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. ప్రతిభను గుర్తించి క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.






