ఓజోన్ పరిరక్షణ దినం

16-09-2026 | 05:32pm

నిర్మల్ ,సెప్టెంబర్ 16 ( విజయక్రాంతి): "ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవాన్ని"( 16th September)   పురస్కరించుకుని  ఆలూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఓజోన్ పరిరక్షణ(Ozone Protection)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ రామకృష్ణారావు, అటవీ క్షేత్ర అధికారి, నిర్మల్ హాజరై విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణలో ఓజోన్ పొర ప్రాముఖ్యతను వివరించారు.

ఓజోన్ పొర భూమికి రక్షణ కవచంలా, రక్షక గొడుగులా పనిచేస్తూ సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత (UV) కిరణాల నుంచి జీవరాశులను కాపాడుతుందని తెలిపారు. ఓజోన్ పొరను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం మహమ్మద్ నజీర్ ఖాన్, ఉప అటవీ క్షేత్ర అధికారి, సారంగాపూర్  విద్యార్థులతో "ఓజోన్ పరిరక్షణ ప్రతిజ్ఞ" చేయించారు. ఈ కార్యక్రమంలో చంద్ర నాగకాంత్, ప్రధానోపాధ్యాయులు, మహమ్మద్ నజీర్ ఖాన్ Dy. RO, సంధ్య, సంతోష్, వెన్నెల, సుజాత, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు