6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

పాకిస్థాన్ ఘన విజయం

27-11-2024 12:00 AM

జింబాబ్వేతో రెండో వన్డే

బులవాయో: జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్ బోణీ కొట్టింది. తొలి వన్డేలో అనూహ్య ఓటమి చవిచూసిన పాక్ రెండో వన్డేలో మాత్రం 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 32.3 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్ (33) టాప్ స్కోరర్.

పాక్ బౌలర్లలో అబ్రర్ అహ్మద్ 4 వికెట్లు, అగా సల్మాన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్థాన్ 18.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 148 పరుగులు చేసి విజయం సాధించింది. సయీబ్ అయూబ్ (62 బంతుల్లో 113 నాటౌట్) అజేయ శతకంతో మెరవగా.. అబ్దుల్లా షఫీక్ (32 నాటౌట్) అతడికి సహకరించాడు. ఇరుజట్ల మధ్య చివరి వన్డే గురువారం జరగనుంది.