calender_icon.png 18 September, 2025 | 12:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విండీస్‌దే తొలి టెస్టు

27-11-2024 12:00:00 AM

అంటిగ్వా: సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్టులో సిరీస్‌లో వెస్టిండీస్ బోణీ కొట్టింది. అంటిగ్వా వేదికగా జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ 201 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌటైంది. మెహదీ హసన్ (45) ఒక్కడే పర్వాలేదనిపించాడు.

విండీస్ బౌలర్లలో రోచ్, జేడన్ సీల్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అంతకముందు వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైంది. తస్కిన్ అహ్మద్ 6 వికెట్లతో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 450 పరుగులు చేసింది, జస్టిన్ గ్రీవ్స్ (115) శతకంతో అలరించాడు.