17 March, 2026 | 2:48 AM

రేపటి నుంచి పార్లమెంట బడ్జెట్ సమావేశాలు

21-07-2024 01:28 AM

తొలిరోజు సభకు ఆర్థిక సర్వే

న్యూఢిల్లీ, జూలై 20: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను సభముందు ఉంచనున్నారు. 23న 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతారు. మూడోసారి బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో వాణిజ్యవర్గాలు, ప్రజల్లో బడ్జెట్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం ఆరు కొత్త బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.