30 June, 2026 | 5:38 PM

భూ పోరాటా సభను విజయవంతం చేయాలి

30-06-2026 05:06 PM

తెలంగాణ రక్షణ సేన జిల్లా ఇన్‌చార్జ్ కిర్మిల్ల వినోద్ చారి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ కిర్మిల్ల వినోద్ చారి, సిర్పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కావేటి సబితా మనోహర్  డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటివరకు అమలు చేయలేదని  పేర్కొన్నారు.

తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో జూలై 2న హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో నిర్వహించనున్న భూ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఉద్యమకారులకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని  ఉద్యమకారులు, తెలంగాణ రక్షణ సేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మహోల్కర్ అశోక్, మహమ్మద్ మోసిన్, నర్సింగోజు సాయి, మహమ్మద్ అబ్బుతాలిబ్, మాచర్ల శ్రీనివాస్, నైతం తిరుపతి, అత్రం వినోద్, కరుణాకర్, పెంటయ్య, శ్రీనివాస్, శ్యామ్‌రావు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.