17 June, 2026 | 6:04 PM

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. ప్రయాణికులకు స్వల్ప గాయాలు

17-06-2026 04:32 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): గుడిహత్నూర్ ఉట్నూర్ ప్రధాన రహదారిపై  రెండు ఆర్టీసీ బస్సులు  ఢీ కొట్టుకున్నాయి. దీంతో రెండు బస్సులలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు  స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే  ఉట్నూర్ డిపోకు చెందిన  బస్సు నంబర్ టీజీ 0120 011 ఇంద్రవెల్లి నుండి  గుడిహత్నూర్ వైపు  ప్రయాణం చేస్తుంది. ఇంద్రవెల్లి మండలం ఏమాయకుంట గ్రామ శివారులో  మామిడి చెట్ల వద్ద రోడ్డు పక్కన లారీ నిలిపి ఉంది. లారీని క్రాస్ చేసి  ముందుకు వెళ్లే క్రమంలో  ముందు నుండి  ఆర్టీసీ బస్సు రావడంతో  బస్సు డ్రైవర్ బ్రేకులు వేశారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన  టీ ఎస్ 01u c 2125 బస్సు ఇంద్రవెల్లి నుండి  గుడిహత్నూరుకు వెళ్తూ  ఉట్నూర్ డిపోకు చెందిన బస్సును  వెనుక నుండి ఢీకొట్టారు. దీంతో రెండు బస్సులలో  ప్రయాణం చేస్తున్న ప్రయాణిలకు స్వల్ప గాయాలు అయ్యాయి..