పాల్వంచ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు గా పసుమర్తి(గోల్డ్) రాము
పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణంలో విశ్వహిందూ పరిషత్(Vishwa Hindu Parishad) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల్వంచ గణేష్ ఉత్సవ సమితి(Palvancha Ganesh Utsav Samiti) కి అధ్యక్షులుగా పసుమర్తి (గోల్డ్) రాము, కార్యదర్శి గారు వేములపల్లి ప్రవీణ్ ని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. శుక్రవారం పాల్వంచ పట్టణంలోని జయమ్మ కాలనీలో గల శ్రీ లక్ష్మీ లేక్ వ్యూ ఫంక్షన్ హాల్ లో జరిగిన పాల్వంచ గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో వారిని ఎన్నుకున్నట్లు విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన కార్యదర్శి గడిదేశి వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ సందర్భంగా పసుమర్తి (గోల్డ్) రాము మాట్లాడుతూ... పట్టణంలో హిందువులు అందరూ వివాదాలకు, అల్లర్లకు తావు లేకుండా, మండపాల వద్ద తగు జాగ్రత్తలు పాటిస్తూ, భక్తి భావంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో పాల్వంచ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చిలుకూరి నాగేశ్వరరావు, చింతలచెరువు శ్రీనివాస్, రాపాక రమేష్, చెరుకు భాగ్యలక్ష్మి, గంగాధరి సీత తదితరులు పాల్గొన్నారు.






