ఈస్ట్‌జోన్ కెప్టెన్‌గా పటిదార్
రింకూకు వైస్ కెప్టెన్సీ
ముంబై, ఆగష్టు 1 : దులీప్ ట్రోఫీ కోసం సెం ట్రల్ జోన్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు రజత్ పటీదార్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఫిని షర్ రింకూ సింగ్ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. 15 మందితో పాటు అమన్దీప్ ఖరె, మయాంక్ మిశ్రా, సౌరబ్ రావత్, భార్గవ్ మెరాయ్, కునాల్ యాదవ్, కుమార్ కార్తికేయలు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.ఇటీవలే శ్రీలంకతో టెస్టు సిరీస్కు ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న ఆల్రౌండర్ సారాంశ్ జైన్ కూడా సెంట్రల్ జోన్లో చోటు లభించింది.
సారాంశ్తో పాటు ఎస్‌ఆర్హెచ్ బౌలర్లు జీషన్ అన్సారి, హర్ష్ దూబేలకు కూడా జట్టులో చో టు లభించింది. ఆగస్టు 23న ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో ఐదు టెస్టులు జరగనున్నాయి. సెంట్రల్ జోన్‌తో పాటు నార్త్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, వెస్ట్ జోన్‌తో పాటు సౌత్ జోన్ ఉన్నాయి. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. అయితే గతేడాది జరిగిన దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ నిలిచింది.
సెంట్రల్ జోన్ జట్టు: రజత్ పాటిదార్ (కెప్టెన్), రింకు సింగ్ (వైస్ కెప్టెన్), ఆర్యన్ జుయల్ (వికెట్ కీపర్), సారాంశ్ జైన్, అమన్ మొఖాడే, కునాల్ చండేలా, జీషన్ అన్సారీ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, హర్ష్ దూబే, కునాల్ సింగ్ రాథోడ్ (వికెట్ కీపర్), యాష్ ఠాకూర్, నాచికేత్ భూటె






