చంద్రబాబు నుంచి నేర్చుకుంటా: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రైల్వే కోడూరు: రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లడానికి ఆలోచిస్తున్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గ్రామాలకు ఏం కావాలనే దానిపై చిత్త శుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని గ్రామాలను స్వర్ణ గ్రామాలు చేసుకోవాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్నమయ్య జిల్ల రైల్వే కోడూరు మండలం మైసూరు వారి పల్లెలో స్వర్ణ గ్రామ పంచాయితీ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వం పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. 13326 పంచాయితీలు బల పడితేనే రాష్ట్ర అప్పు తీర్చగల మన్నారు. అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించేది చంద్రబాబు మాత్రమే అన్నారు. పాలనానుభవం ఉన్న చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ అన్నారు.






