21 May, 2026 | 12:26 AM

ఉద్యోగులకు.. రైట్ టూ డిస్ కనెక్ట్ హక్కు!

23-08-2024 03:33 PM

కాన్ బెర్రా: ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని సంరక్షించేలా సరికొత్త చట్టం అమలులోకి రానుంది. దీని ప్రకారం పని గంటలు పూర్తయిన తర్వాత తమ బాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. దీంతో వారికి పని నుంచి దూరంగా వ్యక్తిగత జీవితానికి వెసులుబాటు దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి  ఈ చట్టాన్ని ఆస్ట్రేలియాలో ఫిబ్రవరిలోనే పాస్ చేశారు. కొత్త చట్టం ఆస్ట్రేలియా పార్లమెంట్ లోకి రాగానే .. పలు సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆస్ట్రేలియాలోని ఫెయిర్‌ వర్క్ యాక్ట్ లోని లోపాలను పూడ్చడానికి  ఈ సరికొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు. దీంతో పాటు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని క్రిమినలైజ్ చేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలెట్టారు. ఇప్పటికే ఫ్రాన్స్, జర్మనీ తదితర యూరోపియన్ దేశాలలో పనిగంటల తర్వాత తమ ఫోన్ల ను స్విచ్చాఫ్ చేసుకొనేలా చట్టాలున్నాయి. యూకేలో కూడా లేబర్ పార్టీ ప్రభుత్వం సైతం రైట్ టూ డిస్ కనెక్ట్ చట్టాన్ని అమలు చేయాలని చూస్తోంది.