రిటైర్మెంట్ బకాయిలు చెల్లించండి
మహబూబాబాద్/ హనుమకొండ టౌ న్, మార్చి 31 (విజయక్రాంతి): పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ బకాయిలు వెంటనే చెల్లించి పెన్షనర్ల ప్రా ణాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగులు కలెక్టరేట్ల ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ (బకాయిల సాధన కమిటీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవా జిల్లా అధ్యక్షులు సంకా బద్రినారాయణ గౌరవ అధ్యక్షులు సోమ గోవర్ధన్, గూగుల్లోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు రిటైర్డ్ అయిన పెన్షనర్ల రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని, వివిధ రకాల ఉద్యమాలు ఆరు నెలల నుండి చేస్తున్నప్పటికీ, ప్రభుత్వము బకాయిలు చెల్లించని కారణంగా రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాలు రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరినప్పటికీ ప్రభుత్వము కావాలని పెన్షనర్ల సమస్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం మానవత్వం లేకుండా, దయ, కనికరము లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైకరి ప్రదర్శిస్తుందని ఆరోపించారు.
పెన్షన్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురై అనేకమంది మనస్థాపనతో తనూవు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. తమ బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో కు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి సంఘం జిల్లా అధ్యక్షులు మైస నాగయ్య, సభ్యులు యోగేశ్వరరావు, మురళీధర స్వామి, ఈశ్వర్ కుమార, వెంకట్ రెడ్డి, మహేందర్, పద్మావతి, ఉమాదేవి, పద్మ, వెంకటేశ్వర్లు, నిరంజన్ రెడ్డి, బాణాల గోవర్ధన్, మోహన్ రావు, విష్ణువర్ధన్, ఇమామ్, మోహన చారి, వివి నాగేందర్, ఇబ్రహీం, విజయ్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, అంబటి రవీందర్, వీరస్వామి, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండలో..
రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ బకాయిల సాధన రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు, మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టరేట్ల ముందు రాష్ట్ర కోన్వీనర్ శ్రీధర్ల ధర్మేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు కందుకూరి దేవదాసు ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదలకు వినతి పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం.డి అబ్దుల్ గఫర్, మహబూబ్ అలీ, దామోదర్, ఏం. సంజీవరెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఆర్.వి చలం, విశ్వనాథం, సారయ్య, శ్యామ్ రావు, కృష్ణమూర్తి, రాజేందర్, రాజిరెడ్డి, జ్యోతి, రమణి, సోమేశ్వర దేవి, శారద, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




