1 April, 2026 | 2:31 AM

అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి

01-04-2026 12:00 AM

సిటిజన్ విజిలేన్స్ మానిటరింగ్ కమిటీ కన్వీనర్గా మాదాసు శాంతయ్య ఏకగ్రీవ ఎన్నిక 

నవాబ్ పేట, మార్చి 31: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మండలంలో పకడ్బందీగా అమలు చేసేందుకు అందరూ నడుం బిగించాలని దళిత బహుజన శ్రామిక యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో దళిత బహుజన శ్రామిక యూనియన్, ’పార’ సంస్థల ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి ‘సిటిజన్ విజిలేన్స్ మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కన్వీనర్గా ఎం ఆర్పీఎస్ సీనియర్ నాయకులు మాదాసు శాంతయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ మేరకు డి.బి.ఎస్.యు నాయకులు ఆనంద్ ఒక ప్రకటనలో వివరాలను వెల్లడించారు. కమిటీ కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, ఆంజనేయులు (మాదిగ జనజాగృతి), పాండు (లంబాడీ హక్కుల పోరాట సమితి), శంకర్ (సఫాయి కర్మచారి ఆందోళన్), జర్నలిస్టులు వెంకటయ్య, శేఖర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేయడంలోనూ అట్రాసిటీ చట్టం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూడటంలోనూ ఈ కమిటీ క్రియాశీలకంగా పని చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ల సంఘం నాయకులు శేఖర్, రైతు సంఘం నాయకులు మునేష్, డి.బి.ఎస్.యు రాష్ట్ర కమిటీ సభ్యులు కొంగళ్ళ శాంతయ్య, నాయకులు కొనింటి బాలయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.