రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల AICC ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ ఛైర్మన్ల రెన్యూవల్, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జిల్లాలో జరిగే భేటీలు, జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రులపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో సహా పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఈ చర్చలు సాగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహం కూడా ఈ సమావేశంలో ఒక కీలక అంశంగా చర్చకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.






