అక్రమంగా నిల్వ చేసిన పీడీఎస్ బియ్యం స్వాధీనం
ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భూపాలపల్లి టౌన్, జులై 23 (విజయక్రాంతి): అక్రమంగా నిల్వ చేసిన 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాలతో జిల్లా సీసీఎస్ పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి, అక్రమంగా ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ పిడిఎస్ బియ్యాన్ని నిల్వ చేసిన చిట్యాల మండలం ముచినిపర్తి గౌరీశెట్టి సత్యనారాయణ, కిరాణా వ్యాపారి, కాగా అతని వద్ద నుండి సుమారు 6 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న బియ్యంతో పాటు చట్టపరమైన చర్యల నిమిత్తం చిట్యాల పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలకు అందించాల్సిన పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీసులు హెచ్చరించారు.






