23 July, 2026 | 5:07 PM

ఎదిగిన పంటలను కాపాడుకోండి

23-07-2026 04:01 PM

బోథ్, జులై 23 (విజయక్రాంతి): ఎల్ ని నో ప్రభావం వల్ల అతి తక్కువ వర్షాలు కురుస్తున్నాయని రైతులు ఎదిగిన పంటలను కాపాడుకునే విషయంలో తగు చొరవ చూపించాలని బోథ్ మండల వ్యవసాయ అధికారి రవితేజ సూచించారు. మండలంలోని కౌటబి గ్రామంలో నీ రైతు వేదిక లో రైతులతో సమావేశమయ్యారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వామి ఏఈఓ వాజీద్ ఉపాధి హామీ ఎపిఎం జగదే రావు గ్రామ కార్యదర్శి అంజయ్య వెలుగు సీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఎదుగుతున్న పంటలను కాపాడేందుకు కలుపు మొక్కలను నివారించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు అంతేగాక మితిమీరిన ఎరువులను వాడవద్దని అవసరం మేరకే వాడాలని కోరారు