23 July, 2026 | 5:37 PM

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో

23-07-2026 04:51 PM

కుబీర్ (విజయ క్రాంతి): మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నీట్ పేపర్ లీకేజీ తోపాటు, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా మండల కేంద్రం కుబీర్ లోని వివేకానంద చౌక్ లో రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సర్పంచ్ కందూరు సాయినాథ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, వైస్ చైర్మన్ హైమద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.