23 July, 2026 | 5:37 PM

వర్షాకాలం వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తం

23-07-2026 04:54 PM

మూడు పీహెచ్ సి ల మరమ్మతులకు  నిధులు మంజూరు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి  డాక్టర్ సాధన

ఉట్నూర్, జులై 23 (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలోని  22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  విధులు నిర్వహించే వైద్యులతో పాటు  వైద్య సిబ్బంది వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల  అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాధన  వైద్య సిబ్బందికి సూచనలు చేశారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడుతూ  గ్రామాల్లో తరచూ తిరుగుతూ .. అంటువ్యాధుల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.

ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వర్షం కురిసినప్పుడు  ఇబ్బందులు పడుతున్న విషయాన్ని  గుర్తించడం జరిగిందన్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మత్తుల కోసం  ప్రభుత్వం  4 లక్షలు  మంజూరు చేసిందన్నారు. గాదిగూడ మండలంలోని  గాదిగూడ  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మరమ్మతులు చేసేందుకు 6.40 లక్షలు మంజూరయ్యాయని, గాదిగూడ మండలంలోని  జారీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మత్తులు చేసేందుకు  4.60 లక్షల మంజూరయ్యాయని  డాక్టర్ సాధన తెలిపారు. ఈ నిధులతో వెంటనే మరమ్మతులు చేపట్టి  రోగులకు ఇబ్బంది లేకుండా  చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డాక్టర్ సాధన వెంట  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ  అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడిమేత  మనోహర్, జిల్లా ప్రోగ్రాం అధికారి  దేవిదాస్, డాక్టర్ పూజిత వైద్య సిబ్బంది పాల్గొన్నారు.