15 March, 2026 | 7:34 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి

19-01-2026 12:00 AM

హనుమకొండ టౌన్, జనవరి 18 (విజయక్రాంతి): హనుమకొండ బాలసము ద్రంలోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎన్ హెచ్ ఎం జాయింట్ యా క్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్ హెచ్ ఎం ఉద్యోగస్తుల సమస్యలు పెం డింగ్ లో ఉన్న నాలుగు నెలల జీతాలు ఇపి ్పంచాలని, తెలంగాణ రాష్ట్రంలో 78 క్యాలెండర్లలో 17వేల ఉద్యోగులు పనిచేస్తున్నారని వారిని అందరిని రెగ్యులరైజ్ చేయాలని కోర డం జరిగింది.

ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ వచ్చే నెలలో సీఎంతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న జీతాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు డాక్టర్ మహేందర్ రావు, పుట్ట మహమ్మద్ రుక్ముద్దీన్, మొగిలి, నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.