19-01-2026 12:00:00 AM
మహబూబాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): కేసముద్రం వ్యవసాయ మార్కెట్ లో ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి నెట్బాల్ సీనియర్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ చూపిన మహబూబాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులు ఈనెల 11 నుండి 14 వ తారీకు వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన 43వ జాతీయస్థాయి సీనియర్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో రాష్ట్రస్థాయి సీనియర్ జట్టు తరపున పాల్గొని పంజాబ్ తో తలపడి ద్వితీయ స్థానం కైవసం చేసుకొని సిల్వర్ మెడల్స్ సాధించారు.
ఇదే టోర్నమెంట్లో మహబూబాబాద్ జిల్లా మహిళల జట్టు తృతీయ స్థానం కైవసం దక్కించుకొని జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన క్రీడాకారులు జన్ను హరీష్, దండు సుమంత్, సోమారపు సందీప్, పవిత్రలను జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తుమ్మ సురేష్, పుల్లా శ్రీనివాస్, కే. రాకేష్ రెడ్డి, కొప్పుల శంకర్, సంతోష్ రెడ్డి, శ్రీనివాస్, జి.సదయ్య, సిహెచ్ ఎలేందర్ తదితరులు అభినందించారు.