19-01-2026 12:00:00 AM
డిజిపి శివధర్ రెడ్డి గారి చేతుల మీదుగా పిప్పింగ్ కార్యక్రమం నిర్వహణ
మేడారం, జనవరి 18 (విజయక్రాంతి): ములుగు ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శివం ఉపాధ్యాయ కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర డిజిపి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా శివం ఉపాధ్యాయకు పిప్పింగ్ కార్యక్ర మం ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా డీజీపీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ ను అభినందిస్తూ ఆయన సేవా భావం, క్రమశిక్షణ వృత్తిపర మైన నిబంధన ప్రశంసనీయమని పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసింగ్ అందిస్తూ కొత్త బాధ్యతలో కూడా అదే అంకితభావంతో పనిచేయాలని సూచించారు. శివం ఉపాధ్యాయ మాట్లాడుతూ ఈ పదోన్నతిని తనకు లభించిన గౌరవంగా భావిస్తూ రాష్ట్ర పోలీసు విభాగం ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వహిస్తానని తెలిపారు.