7న పెన్షనర్ల జేఏసీ మహాధర్నా
04-08-2026 01:09 AM
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 7న చలో ఇందిరాపార్క్ మహాధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వ పెన్షన్‌దారుల సంయుక్త కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. సోమవారం పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె.లక్ష్మయ్య అధ్యక్షతన హైదరాబాద్‌లో కోర్ కమిటీ సమావే శం జరిగింది.
హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించాలని, పీఆర్సీ అమలు చేయాలని, డీఏలు విడుదల చేయాలని ప్రభుత్వానికి కోర్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు తులసి సత్యనారా యణ, కృష్ణప్రసాద్, టి.శుభాకర్ రావు, భరత్ రెడ్డి, జయప్రకాశ్‌రావు పాల్గొన్నారు.






