ప్రతి ఒక్కరూ అమ్మ పేరిట మొక్క నాటాలి
- దానిని సంరంక్షించే బాధ్యత కూడా తీసుకోవాలి
- సీసీఎఫ్ ప్రియాంక వర్గీస్
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సీసీఎఫ్ ప్రి యాంక వర్గీస్ సూచించారు. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో సోమవారం ఎన్సీసీ విద్యార్థులు నిర్వహించిన ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వనమహోత్సవంలో ప్రియాంక వర్గీస్ పాల్గొని విద్యార్థులతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ప్రి యాంక వర్గీస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు నాటడం ఎంత ము ఖ్యమో, వాటిని పెంచి కాపాడడం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఒక మొక్కను నాటి, దా నిని జీవితాంతం సంరక్షించే అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల యా జమాన్యం, ఎన్సీసీ అధికారులు, విద్యార్థులు పచ్చదన పరిరక్షణకు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, ఎన్సీసీ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.






