27 February, 2026 | 10:55 AM

మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరికి మతి భ్రమించిందో ప్రజలే గమనిస్తున్నారు

27-02-2026 12:29 AM

మంథని బోయినిపేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి

మంథని, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) మంథని మున్సిపల్ ఎన్నికల ఫలితాల త ర్వాత ఎవరికీ మతి బ్రమించిందో బోయినిపేట ప్రజలే గమనిస్తున్నారని బోయిన్ పేట్ 6 వార్డ్ కౌన్సిలర్‌పోతరవేని శ్రీలతక్రాంతి అ న్నారు.గురువారం బోయినిపేట లో వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ప్రజలతో ఎన్నోకోబడ్డ ఒక బీసీ మహిళా కౌ న్సిలర్ ని మతి బ్రమించిందని మాట్లాడుతు న్న అవివేకుల విజ్ఞతకే వదిలేస్తున్నిమని అ న్నారు.

బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక మహిళా ప్రజాప్రతినిధిని గౌరవించలేని సంస్కారహీనులను పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వారిని ఎలా ఉపేక్షిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. ఇందిర మ్మా ఇల్లులకు సంబంధించిన అధికారులే ఎన్నికల ముందు ఇందిరమ్మ ఇల్లుల లబ్దిదారుల్లో ఆర్ధిక పరిస్థితులు సరిగా లేని నిరుపే దలకు తగు న్యాయం చేస్తామని హామీ ఇ చ్చిన తర్వాత మేము గెలిచాక మా దగ్గరికి వ చ్చిన ఆ పేదలకు నాయ్యం చేయాలనీ ఒక మంచి ఉద్దేశంతో ఏఈ ని సంప్రదించిగా వా రి సమక్షంలోనే ఇల్లులు కట్టే మేస్త్రిని పిలిపిం చి లబ్దిదారుల ముందే సంబంధిత అధికారితో మాట్లాడించడం

జరిగిందని,దీనిని జీర్ణించుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు పేద ప్రజల పొట్టకొడుతూ వాట్స్‌ఆప్ గ్రూ పుల్లో ఇస్తానుసారంగా పోస్ట్లు పెడుతూ ఆ యొక్క మేస్త్రికి సంబంధిత అధికారులను బె దిరింపులకు గురిచేస్తే ఆ యొక్క మేస్త్రి బయపడి తెల్లారే పని మొదలు పెడుతమని చెప్పి ఇప్పటి వరకు రాకపోవడంతో ఇల్లులు కూ ల్చి వేసుకొని పిల్ల పాపలతో రోడ్డు మీద జీ వనం సాగిస్తున్న వారి పరిస్థితి ఎలా ఉం టుందో ఆలోచించండని అన్నారు.ఇందిర మ్మా ఇండ్ల కమిటీ సభ్యులమని చెప్పుకునే వారికి ఒకటే చెప్తున్నామని, బోయినిపేట్ నిరుపేదల జోలికి వచ్చిన వారిని బెదిరించి న ఊరుకునేది లేదని,

వీలైతే వారికి తోడుగా నిలబడండి అని లేదంటే బోయిని పేట్ జ నం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంట్లో కూర్చోండని, మా బోయిన్ పేట్ ప్రజల దగ్గర డ బ్బు లు లేవు కావచ్చు కాని చాలా విజ్ఞాన వంతులని, అందుకే ఎవరికీ పదవులు ఇవ్వా లో ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలో నిర్ణయించి వారి ఓటు అనే ఆయుధంతో తీర్పు చెప్పారని,ఇకనైనా గౌరవనీయులు పెద్దలు మంత్రి శ్రీధర్ బాబు ఇలాంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒక బీసీ మహిళా ప్రజాపతినిధిని గౌరవించలేని, ఇలాంటి సంస్కార హీనులను దూరం పెట్టి నిరుపేద పేద ప్రజలకు మీరు ఇచ్చే ప్రభుత్వ పథకాలు అందేలా చూడాల ని కోరుతున్నామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ తో పాటు మత్స్యశాఖ అధ్యక్షులు క్రాంతి ఇందిరమ్మా ఇల్లుల లబ్దిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.