17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మురుగు కనుమరుగయ్యేదెప్పుడు?

08-02-2026 06:48 PM

వర్షాకాలం పోయి మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు ఇదే పరిస్థితి...

జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జవహర్ నగర్ డివిజన్లో గల పాపయ్య నగర్ కాలనీ లో మురుగునీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందులకు ఆవాసంగా మురుగుతో, దుర్వాసనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.పాపయ్య నగర్ కు వెళ్ళేదారిలో వెళ్ళాలంటే ముక్కు మూయాల్సిందే, 'మురుగుతో ఈగలు, దోమల వల్ల ఆసుపత్రుల పాలు కావాల్సిందేనా!! వానాకాలం ముగిసిన ... మురుగు నీటితో పందులు, దోమలు, ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి.

అటు వైపు వెళ్ళాలంటే ముక్కుమూసుకొని పోవాల్సిందే.పాపయ్య నగర్  వెళ్ళే దారిలో మురుగు నీరు స్థలంలో చెరువును తలపిస్తుంది. కలుషితమైన రసాయానాలుగా తయారై ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కాలనీల ప్రజలు దుర్వాసను భరించలేక రోగాల పాలవుతున్నారు. పనుల కోసం పట్టణాలకు వెళ్ళే ప్రజలు నిత్యం వేలాది మంది ఈ రోడ్డు వెంబడే ప్రయాణం సాగించాల్సి వస్తోంది. దుర్వాసనకు భరించలేక ముక్కుమూసుకునే పోతుంటే ఊపిరాగినంత పని అవుతుంది. వానాకాలం ముగిసిన పట్టింపేది ? వానాకాలం ముగిసిన మురుగు నీటిని పంపేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. వ్యాధులు సంభవించకముందే మేల్కొంటే మేలని ప్రజలు వేడుకుంటున్నారు.