15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాంగ్రెస్ నాయకురాలు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

08-02-2026 06:52 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): “ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం” అన్న నినాదంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. బల్కంపేటలోని గండిమైసమ్మ దేవాలయం సమీపంలోని DKR మెమోరియల్ హై స్కూల్ ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకురాలు దూసరి పద్మావతి విజయ్ గౌడ్, అపోలో హాస్పిటల్‌కు అనుబంధంగా, ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షురాలు కోట నీలిమ  హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.

శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను స్వయంగా పరిశీలించి డాక్టర్లు, నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడం సమాజానికి నిజమైన సేవ అని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. శిబిరంలో మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అపోలో హాస్పిటల్ వైద్యుల బృందం బీపీ, షుగర్ పరీక్షలతో పాటు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించింది. వైద్యులు ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలను శ్రద్ధగా విని తగిన సూచనలు ఇచ్చారు.

అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం విశేషం.స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి శిబిరాలను తరచుగా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అంకితభావంతో నిర్వహించిన ఈ శిబిరం స్థానికంగా విశేష స్పందన పొందింది.ఈ కార్యక్రమంలో  సీనియర్ నాయకులు ఆసిఫ్ భాయ్, నవీన్ రాజ్, శ్రీకాంత్ యాదవ్, గోవింద్ రాజ్ సాయి గౌడ్, నరేష్, శ్రీకాంత్‌గౌడ్,ఆండాలు, సుకన్య , రాజేశ్వరి, ముత్తు తదితరులు పాల్గొన్నారు.