29-07-2025 01:12:10 AM
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): హైడ్రా కూల్చివేతల సమయంలో... ఇచ్చిన హామీలను నెరవేర్చని సీఎం రేవంత్ రెడ్డి ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మహిళలు అనరా ని మాటలు అంటూ శాపనార్ధాలు పెట్టారని, ప్రజలతో ఇన్ని తిట్లు తింటున్న ఇలాంటి థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
మరో వైపు సమస్యలు తీర్చమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వద్దకు వెళ్లిన ప్రజలతో ప్రభుత్వం మనది లేదని మాట్లాడి చేతులు దులుపుకోవడం ఎమ్మెల్యే పని కాదని పేర్కొన్నారు. సోమవారం సాత్నాల మం డలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నేతల వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని ధ్వజమెత్తారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జోగు రామన్న పిలుపునిచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత హామీలను స్థానిక సంస్థల ఎన్నికల ఓట్లతో బుద్ధి చెప్పాలన్నారు..
గత ప్రభుత్వ బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి మరుమూల గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి కమిటీ హాలు, రైతు వేదికలు, గ్రామ రోడ్ల నిర్మాణాలు, తో పాటు స్కూల్లో పునరుద్ధరణ, ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలపై వివక్షన కొనసాగిస్తూ మహిళలకు అందాల్సిన 2500 పెన్షన్ తో పాటు తులం బంగారం, 500 గ్యాస్ అని ప్రలోభాలకు గురి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లు యాసం నర్సింగ్ రావు, మెట్టు ప్రహ్లాద్, నాయకులు దేవన్న, బుచ్చన్న, వేణు గోపాల్ యాదవ్, ఉగ్గే విట్టల్ పాల్గొన్నారు.